అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూరుగడ్డ ్రగ్రామంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కౌడిపల్లి ఎస్సై అమరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రైతు తాటి శంకరయ్య(55)కు అర ఎకరం వ్యవసాయ భూమి ఉన్నది. అందులో పంటలు పండించడంతోపాటు హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.
- మెదక్ జిల్లా బూరుగడ్డలో విషాదం
కౌడిపల్లి, అక్టోబర్ 22: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూరుగడ్డ ్రగ్రామంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కౌడిపల్లి ఎస్సై అమరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రైతు తాటి శంకరయ్య(55)కు అర ఎకరం వ్యవసాయ భూమి ఉన్నది. అందులో పంటలు పండించడంతోపాటు హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.
ముగ్గురు కూతుర్లకు పెండ్లిళ్లు చేయగా, అందుకోసం చేసిన అప్పుల అధికమయ్యాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక నిత్యం మదనపడేవాడు. దసరా పండుగ కోసం సొంతూరుకు వచ్చిన ఆయన బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలి సి భోజనం చేసి పడుకున్నాడు. ఉద యం లేచి చూసేసరికి ఇంట్లో కనిపించలేదు. కుటుంబ సభ్యులు వెతుకగా ఇంటి ఆవరణలోని చెట్ట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతు డి భార్య భారతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

