ఇద్దరు రైతుల ఆత్మహత్య.. సాగునీళ్లు లేక ఎండుతున్న పంటలు
సాగునీరందించడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం.. అన్నదాతలకు శాపంలా మారుతున్నది. సరైన వర్షాలు లేక ఓవైపు.. కరెంట్ కోతలతో నీళ్లందక మరోవైపు పంటలు ఎండుముఖం పట్టాయి. కండ్ల ముందే పంటలు దెబ్బతింటుండటంతో చూసి తట్టుకోలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- పెట్టుబడులూ వస్తలేవని మనస్తాపం
- కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విషాదం
శంకరపట్నం/జైనథ్, అక్టోబర్ 19 : సాగునీరందించడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం.. అన్నదాతలకు శాపంలా మారుతున్నది. సరైన వర్షాలు లేక ఓవైపు.. కరెంట్ కోతలతో నీళ్లందక మరోవైపు పంటలు ఎండుముఖం పట్టాయి. కండ్ల ముందే పంటలు దెబ్బతింటుండటంతో చూసి తట్టుకోలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం చోటుచేసుకున్నాయి. బాధిత రైతుల కుటుంబాల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటలో చెందిన నాంపెల్లి సాంబయ్య (55) తనకున్న రెండున్నర ఎకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని, వరి సాగు చేశాడు. రూ.1.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఈ సారి కాకతీయ కాలువకు నీళ్లు విడుదల చేయకపోవడం, తన వ్యవసాయ బావిలో నీళ్లు అడుగంటడంతో ఆందోళనకు గురయ్యాడు. ఎండిపోతున్న పొలానికి నీళ్లు పారించలేక తీవ్ర మనోవేదన చెందాడు.
ఆదివారం బతుకమ్మ పండుగ కావడంతో ఇంట్లో బతుకమ్మ పేర్చి బయటకు వెళ్లాడు. సాయంత్రం భార్య శోభ, కొడుకులు అజయ్, శ్రావణ్ గ్రామంలోని బతుకమ్మ వేడుకలకు వెళ్లి, రాత్రి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10.35 గంటల ప్రాంతంలో సాంబయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఎందుకు తాగావని అడిగితే.. పొలానికి నీళ్లు పారడం లేదని, ఆ బాధతోనే తాగానని చెప్పాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుమారుడు అజయ్ పరిసరాల్లో వెతికాడు. రాత్రి 11:45 గంటల సమయంలో తన వ్యవసాయ పొలానికి సమీపంలో ఉన్న వాగు వద్ద చెట్టుకు లుంగీతో ఉరివేసుకొని విగత జీవిగా కన్పించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పొలానికి సాగునీరు పారుతలేదనే మనస్తాపంతోనే సాంబయ్య ఆత్మహత్య చేసుకున్నాడని భార్య శోభ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కేశవపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతు రవి..
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గూడ గ్రామానికి చెందిన పతాని రవి (48) నాలుగెకరాల్లో పత్తి, సోయా వేశాడు. వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్ర మనస్తానికి గురైన రవి శనివారం రాత్రి తన పశువుల పాకలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతడిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. రవికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జైనథ్ ఎస్సై గౌతమ్ పవార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

