Ashwini | ఒక దొంగతో ప్రేమ వివాహం.. మరో దొంగతో సహజీవనం.. ఆపై నకిలీ పోలీస్ అవతారం
ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్షిప్లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది.
- ఇంకో దొంగతో రిలేషన్షిప్
- ఆటకట్టించిన పోలీసులు
Ashwini | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్షిప్లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది. చివరికి నకిలీ పోలీస్ అవతారం ఎత్తి కిలేడీగా మారింది. ఆమె ఆటలు పసిగట్టిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకెళితే.. గుడిసెల అశ్విని ఇంటర్ వరకు చదివి, ఇండ్లలో దొంగతనాలు చేసే రోహిత్‌శర్మ అనే ఒక వ్యక్తిని ప్రేమ పెండ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు పిల్లలు.
తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో అతడిని వదిలేసి, రోహిత్ సింగ్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఇతడిని కూడా వదిలేసి అభిషేక్‌తో కలిసి ఉంటున్నది. ఇతడు బైక్‌ల దొంగ. అరెస్ట్ అయ్యి, జైలులో ఉన్నాడు. దీంతో తన విలాసాలకు డబ్బు కావాలని ఆలోచించి, నకిలీ పోలీస్ అవతారం ఎత్తింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నానంటూ చెప్పుకుంది.
ఈ క్రమంలోనే లంగర్‌హౌస్‌లో నివాసం ఉండే రాకేశ్ నాయక్‌తో పరిచయమైంది. అతడికి నాంపల్లి కోర్టులో సీనియర్ అడ్వకేట్ వద్ద అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని, నెల కు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని నమ్మించి, రూ.30 వేలు వసూలు చేసింది. తర్వాత కనిపించకుండా పోవటంతో రాకేశ్‌కు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం తెలిసింది. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అశ్వినిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణకు లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

