Ex Minister Rajaiah | కడియం కాస్కో.. ఇక కబడ్డీ కబడ్డే.. : మాజీ మంత్రి రాజయ్య
Ex Minister Rajaiah | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బిడ్డా కాస్కో.. ఇక మధ్య కబడ్డీ.. కబడ్డే.. తగ్గేదే లే అంటూ సవాల్ విసిరారు.
Ex Minister Rajaiah | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బిడ్డా కాస్కో.. ఇక మధ్య కబడ్డీ.. కబడ్డే.. తగ్గేదే లే అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటేరా.. స్టేషన్ ఘనపూర్‌లో నువ్వు చేసిన అభివృద్ధి.. నేను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. విదేశాల్లో కడియం శ్రీహరికి ఆస్తులున్నాయని.. ఆ అక్రమ ఆస్తులకు కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలు అన్నారు.
ఇక్కడ దోచుకున్న డబ్బులతో మలేషియా, సింగ్‌పూర్‌లో అక్రమాస్తులు కూడబెట్టారన్నారు. హవాలా రూపంలో డబ్బు విదేశాలకు తరలించారని ఆరోపించారు. తనకు లొంగనివాళ్లను ఎన్ కౌంటర్ చేయించిన దుర్మార్గుడు కడియం అంటూ మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు డీఈఓల బదిలీల్లో రూ.2కోట్లు, లింగంపల్లి ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వద్ద రూ.6 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. పేకాట ఆడుతూ దొరికితే పోలీస్ స్టేషన్లో కూర్చో బెట్టలేదా? సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉండి అమాయక పిల్లల పొట్టకొట్టి కోట్లు దోచుకున్న చరిత్ర కడియం శ్రీహరిదని విమర్శించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ బీజేపీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోతుందన్నారు. తాము పడగొట్టాల్సిన అవసరం లేదన్నారు. కడియం దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. నన్ను ఒడగొట్టుకున్న పాపానికి పాలకుర్తి ప్రజలు ఏడుస్తున్నారన్నారు. రాజకీయాల్లో కడియంని మించిన ద్రోహి లేడన్నారు. ఉద్యమ సమయంలో కూడా ఏడుసార్లు గెలిచిన చరిత్ర తదన్నారు.
ఒక్కసారి ఓడిన నన్ను పట్టుకొని విమర్శలు చేస్తున్నాడన్నారు.
నాలుగుసార్లు ఓడిపోయిన కడియం శ్రీహరి తన గురించి మాట్లాడడానికి సిగ్గులేదా? అంటూ విమర్శించారు. నవ్వు ఎక్కడ పుట్టినవ్ ? ఎక్కడ పెరిగినవ్..? జీవిత చరిత్ర మొత్తం త్వరలోనే బయటపెడతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదని.. ఒక్క పథకం కూడా అమలు చేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పీడిచ్చి దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ మొత్తం దివాలా తీసిందన్నారు. అమెరికాలో ఏం బ్రోకర్ మాటలు మాట్లాడావన్నారు. రెండేళ్లలో ఆర్టీసీ దివాళా తీయడం ఖాయమని.. తన అనుభవంతో చెబుతున్నానన్నారు.
కడియం శ్రీహరి ఒక పచ్చి వెధవ.. నరరూప రాక్షసుడు
కడియం శ్రీహరి అవినీతికి సామ్రాట్.. మాదిగ జాతి కడియం శ్రీహరి మీద తూ.. తూ.. అని ఊస్తుంది- తాటికొండ రాజయ్య pic.twitter.com/bgJ0ZqpNRk
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

