ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి : గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై | ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి.. కరోనా నుంచి రక్షణ పొందాలి అని రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు.

రంగారెడ్డి : ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి.. కరోనా నుంచి రక్షణ పొందాలి అని రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కేసీ తండాలో గవర్నర్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీ తండాలో గవర్నర్ రెండో డోసు టీకా తీసుకున్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు సమావేశంలో గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. గవర్నర్ ప్రసంగం.. మీ అందర్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానం, ప్రేమ అని చెప్పారు. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని తెలిసింది. మీకందరికి ధైర్యం చెప్పేందుకు కేసీ తండాకు వచ్చాను. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. మనందరం వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్‌ను జయించొచ్చు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.. ఇతరులకు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పాలి. నేను కేసీ తండాలో వ్యాక్సిన్ తీసుకొని విన్నపం చేస్తున్నాను.. అందరూ వ్యాక్సిన్ తీసుకోని కొవిడ్ నుంచి రక్షణ పొందాలి. అందరూ తప్పకుండా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. తరుచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. కొవిడ్ నుంచి రక్షణ పొందాలి అని గవర్నర్ తమిళిసై సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

