పళ్లెంలో అష్టాహారం!

- సమపాళ్లలో పదార్థాలుండాలి
- తాజా, వేడి ఆహారమే తినాలి
- పాలు, గుడ్లు కచ్చితంగా ఉండాలి
- బాదాం, ఖాజులోనే కాదు..పప్పుల్లోనూ బోలెడు ప్రొటీన్లు
- మధ్యతరగతికీ అందుబాటులో..
- ఆహార నిపుణుల సూచన
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తినే ఆహారంలో కనీసం 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలంటున్నారు ఆహార నిపుణులు. మన వద్ద 90 శాతం మంది ప్రజలు కార్బొహైడ్రేడ్స్ ఉన్న ఆహారపదార్థాలను అధికంగా తీసుకుంటారని జాతీయ ఆహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో తేలింది. ఇప్పటికైనా అధిక మోతాదు కార్పొహైడ్రేట్స్కు స్వస్తి పలికి ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజు మనం తినే ఆహారంలో డైటరీ డైవర్సిటీ పాటించాలని, శరీరానికి అవసరమైన కనీస ఆహార పదార్థాలు ఉండేలా సూచుకోవాలని చెప్తున్నారు. పేద, మధ్య తరగతి, ధనిక అన్న తేడాలేకుండా ఉన్న బడ్జెట్లోనే ప్రణాళికతో మంచి ఆహారం తీసుకోవచ్చని చెప్తున్నారు. బాదం.. పిస్తా.. మటన్ లాంటివి అక్కరలేకుండానే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు తినవచ్చని తెలిపారు. ఆకు కూరలు, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవాలని వెల్లడించారు. తినే ఆహారం వీలైనంతవరకు వేడిగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు, ప్రతి రోజు కచ్చితంగా రెండు గుడ్లు తినడం మంచిదని, వీటితో పాటు విటమిన్ ఏ, సీ పండ్లను తినాలని వివరించారు.
8 రకాలు ఉండేలా చూసుకోవాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచిది. అలా అని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు సహజంగా లభించే పప్పులు, ఆకు కూరలు, పాలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు మనం తినే ఆహారంలో 8 రకాలు ఉండేలా చూసుకోవాలి.
లక్ష్యయ్య, ఎన్ఐఎన్ శాస్త్రవేత్త
ఇప్పటి వరకు ఎలా తిన్నా, ఏం తినకపోయినా నడిచింది. కానీ ఇకపై అలా కాదు. మనం ఎంత మంచిగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎంత ఆరోగ్యంగా ఉంటే కరోనా మహమ్మారి నుంచి అంత రక్షణ పొందుతాం. అందుకే మనం తినే పళ్లెంలో కచ్చితంగా 8 రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. కార్బొహైడ్రేట్స్‌ను తగ్గించి అధికంగా ప్రొటీన్లు, విటమిన్లు గల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. భారీగా ఖర్చు చేసే అవసరం లేకుండానే దిగువ, మధ్యతరగతి కుటుంబాలూ మంచి ఆహారం తీసుకోవచ్చని పేర్కొంటున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

