అంగన్వాడీల సమరశంఖారావం
తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమరశంఖారావం పూరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ స్టేట్‌హోం ఎదుట భారీ ధర్నాకు దిగారు.
- సమస్యలు పరిష్కరించాలని యూసుఫ్‌గూడ స్టేట్‌హోం వద్ద ధర్నా
జూబ్లీహిల్స్, జూలై 19 : తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమరశంఖారావం పూరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ స్టేట్‌హోం ఎదుట భారీ ధర్నాకు దిగారు. ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై రెండు రోజుల క్రితం స్వయంగా మంత్రి హామీ ఇచ్చినా విశ్వసనీయత లేని ప్రకటనగా పేర్కొంటూ మెరుపు సమ్మెకు దిగారు. దీంతో అమీర్‌పేట్ మైత్రి వనం నుంచి యూసుఫ్‌గూడ మీదుగా నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, ప్రజలు ట్రాఫిక్‌జామ్‌తో గంటల కొద్దీ ఇబ్బందులుపడ్డారు. అంతుకుముందు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 20 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్, డైరెక్టర్ కాంతి వెస్లీకి అందజేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మితో చర్చలు జరిపి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

