రక్తదానానికి ముందుకు రావాలి : డీజీపీ
రక్తదానంతో సాటివారిని ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): రక్తదానంతో సాటివారిని ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ కార్యక్రమాల సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వేలసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తం అందుబాటులో ఉంటే అందులో కొంతమందినైనా కాపాడవచ్చునని తెలిపారు. ప్రతి ఏడాది నాలుగుసార్లు రక్తం ఇవ్వొచ్చని, కనీసం ఒకసారైనా రక్తదానం చేయాలని కోరారు.
రక్తదాన శిబిరంలో 4,500 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు ఆయన వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో తొలిసారి నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఐజీపీలు ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎం రమేశ్, ఏఐజీలు రమణకుమార్, నాగరాజు, డాక్టర్ పిచ్చిరెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీరాములు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

