హైదరాబాద్ : ఎండా కాలంలో అగ్ని ప్రమాదలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు(Fire Service week) నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలపై(Fire hazards) అగ్నిమాపక అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు సంబంధిత శాఖ అధి కారు లు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై వారం రోజుల పాటు అవగాహన కల్పిస్తారు. ఈ నేపథ్యంలో వట్టి నాగులపల్లి అగ్ని మాపక శిక్షణ కేంద్రంలో అగ్నిమాపక వారోత్స వాలను అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి(DG Nagireddy) ఆదివారం ప్రారంభించారు.