హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 ( నమస్తే తెలంగాణ ) : ‘వీ లవ్ సైక్లింగ్.. వీ లవ్ సైక్లింగ్’ నినాదాలతో ఆదివారం సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ హోరెత్తింది. హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్ ఆధ్వర్యంలో పది వేల కిలో మీటర్ల మేర సైక్లింగ్ చాలెంజ్ నిర్వహించారు. ముందుగా, ఈ కార్యక్రమాన్ని డీసీపీ శిల్పావల్లి జెండా ఊపి ప్రారంభించారు.
నగర సైక్లిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని చాలెంజ్‌ను విజయవంతంగా ముగించారు. సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ చాలా గొప్పగా ఉందంటూ ప్రశంసించారు. దేశంలోనే మొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సైక్లిస్టులు ధన్యవాదాలు తెలిపారు.