కార్పొరేట్ మేలుకే ఇంటర్ రద్దు
కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు నిర్ణయం తీసుకొన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు.
- నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి.. స్వతంత్ర నిపుణుల కమిటీ వేయండి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు నిర్ణయం తీసుకొన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. తెలంగాణ బిడ్డల ప్రయోజనాలను విస్మరించి.. కేవలం కార్పొరేట్ విద్యాసంస్థల స్వార్థ ప్రయోజనల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా, మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకోకుండా, బిల్లే లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఏంది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు, సుమారు 1,750 జూనియర్ కళాశాలలు, వేలాది మంది అధ్యాపకుల భవిష్యత్తును ఓ గదిలో కూర్చొని తేల్చడం సరికాదని హితవు పలికారు.
సీబీఎస్ఈ తరహా పాఠశాల ఆధారిత 11,12 తరగతులు సామాన్య కుటుంబాలకు ఉన్నత మాధ్యమిక విద్యను మరింత భారంగా మారుస్తాయని అభిప్రాయపడ్డారు. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ పర్సంటైల్‌లో మన రాష్ట్ర విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటుతున్నారని, ఈ విజయాలకు పునాది ఇంటర్మీడియట్ అని వివరించారు. ఇంటర్ విద్య రద్దుపై ఈ నెల 11న జారీచేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యావేత్తలు, రాజ్యాంగ నిపుణులు, ఉద్యోగ సంఘాలతో స్వతంత్ర నిపుణుల కమిటీ వేసి, దాని నివేదిక బహిర్గతమయ్యాకే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోధన, బోధనేతర సిబ్బంది సీనియారిటీ, ప్రమోషన్లకు లిఖితపూర్వక రక్షణ కల్పించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

