Danam Nagender | తండ్రిని విమర్శించడం కవితకు తగదు.. కేసీఆర్ ప్రజా నాయకుడు : దానం నాగేందర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజానాయకుడని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదర్శనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
హిమాయత్‌నగర్, మే 2: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజానాయకుడని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఆదర్శనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ను కవిత విమర్శించడం సరికాదని అన్నారు.
కవిత కలలు కనాలే తప్ప కబుర్లు చెప్పవద్దని ఎద్దేవా చేశారు. కవిత తన రాజకీయ స్వార్థం కోసం సొంత తండ్రిని విమర్శించడం తగదని హితవు పలికారు. తల్లిదండ్రులను గౌరవించలేని వాళ్లు ఏం మనుషులని ప్రశ్నించారు. కవిత ఇంటి సమస్యను బయటకు తీసుకువస్తున్నదని విమర్శించారు. మరో పదేండ్ల పాటు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాల్సిన కేసీఆర్‌ను కవిత తన మాటలతో మానసికంగా బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
ఈ ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని, ఎవరినీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. తాను ఓటు చోరీ బాధితుడినని, అందువల్లనే సికింద్రాబాద్ ఎంపీగా ఓడిపోయానని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Danam Nagender
- kavitha
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

