35 వేల ఎకరాల్లో పంట నష్టం
మురసు తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను నిండా ముంచెత్తింది. బుధవారం నాటి భారీ వర్షానికి పంటలన్నీ వర్షార్పణమయ్యాయి.
ఖమ్మం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ అశ్వారావుపేట: మురసు తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను నిండా ముంచెత్తింది. బుధవారం నాటి భారీ వర్షానికి పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. గురువారం దాని తీవ్రత మరింత బయటపడింది. ఈ తుఫాన్ తీవ్రతకు పైర్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,066 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.
ఇందులో ఖమ్మం జిల్లాలో 23,140 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 11,926 ఎకరాల్లో వివిధ రాకల పంటలు నష్టపోయినట్టు అధికారులు గుర్తించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో చాలారోడ్లు కోతకు గురయ్యాయి. మిర్చి, వేరుశనగ పంటలను బురద కప్పేసింది. వరి పంట వరదకు తుడిచిపెట్టుకుపోయింది. తిండిగింజలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు లబోదిబోమంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

