కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ భేటీ

హైదరాబాద్ : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ ఎంప్లాయీస్ యూనియన్స్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లకు సిబ్బంది కేటాయింపును విజయవంతంగా పూర్తి చేయడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు, అభిప్రాయాలను తెలపాల్సిందిగా సీఎస్ కోరారు.
పీఆర్సీ అమలు, ఉద్యోగులతో స్నేహపూర్వక విధానాలను పాటిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాయి. వివిధ క్యాడర్లకు అధికారుల కేటాయింపు గురించి ఉద్యోగుల సంఘాలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఇతర సహచరులు, యూనిట్లను సంప్రదించిన తర్వాత ఈ నెల 12వ తేదీన తగు సూచనలతో తిరిగి సీఎస్‌తో సమావేశం కానున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
ఈ సమావేశంలో జీ.ఏ.డీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, జీ.ఏ.డీ ఓఎస్డీ అప్పారావు, HRM & SER సీనియర్ కన్సల్టెంట్ శివ శంకర్, ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి రవి, హోం శాఖ ఎస్వో వనజ, OSD to CM సెక్రటెరీ కృష్ణమూర్తి, టీజీవోల అసోసియేషన్ ప్రెసిడెంట్ మమత, టీఎన్జీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

