తుది దశకు పీఆర్సీ నివేదిక
ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంచేశారు. పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే నివేదికను తెప్పించి మరోసారి సమావేశాన్ని నిర్వహిస్తామని నేతలకు హామీనిచ్చారు.
- జేఎస్సీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంచేశారు. పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే నివేదికను తెప్పించి మరోసారి సమావేశాన్ని నిర్వహిస్తామని నేతలకు హామీనిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్(జేఎస్సీ)సమావేశాన్ని శుక్రవారం సీఎస్ కే రామకృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలు, డిమాండ్లను సమావేశం ముందుంచారు. వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఆర్థికేతర అంశాలను త్వరగా పరిష్కరించాలని సీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
జూన్ 2న హెల్త్‌కార్డులు..
ఉద్యోగుల హెల్త్‌కార్డులను జూన్ 2న జారీచేస్తామని సీఎస్ ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డిజిటల్ హెల్త్‌కార్డులను లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. 2003 డీఎస్సీ టీచర్లు, 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ అమలుపై ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో ప్రస్తావించారు. సమావేశంలో టీఎన్జీవో నేతలు జగదీశ్వర్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాసరావు, బీశ్యామ్, లచ్చిరెడ్డి, రామకృష్ణ, రాములు, పుల్గం దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Drinking Water | చలికాలంలో రోజూ తగినంత నీళ్లను తాగాల్సిందే.. నీరు తగ్గితే ఈ సమస్యలు వస్తాయి..
‘మైనారిటీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ.. ఉపాధి అవకాశాలు’
‘వలసల నివారణే లక్ష్యం’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

