మురిసిన దళిత లక్ష్మి!

- దళిత బంధు సర్వేకు వచ్చిన కలెక్టర్
- కుటుంబపెద్ద లక్ష్మి గుడిసెలో నేలపై కూర్చుని వివరాల సేకరణ
- ఎస్కేఎస్లో లేని పేర్లను నమోదు చేయాలని అధికారులకు ఆదేశం
- అప్పటికప్పుడే పేర్ల నమోదు..
- సంబ్రమాశ్చర్యంలో దళిత కాలనీ
జమ్మికుంట, ఆగస్టు 28 : ఆమె పేరు శనిగరపు లక్ష్మి. దళిత మహిళ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎరుకల వాడలో 20 ఏండ్లుగా ఉంటోంది. భర్త అయిలయ్య రెండేళ్ల క్రితం మృతిచెందాడు. లక్ష్మికి నలుగురు కొడుకులు. ఇద్దరు బిడ్డలు. నలుగురు కొడుకులు వేర్వేరుగా ఉంటున్నారు. వీరిలో ఒక్క కొడుక్కు మాత్రమే 2014కు ముందు పళ్లైంది. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదైంది. తర్వాత ముగ్గురు కొడుకులకు పళ్లైంది. కానీ, ఎస్కేఎస్లో నమోదు కాలేదు. నలుగురు కొడుకులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో దళితబంధు సర్వే మొదలైంది. అప్పటినుంచి వారిలో ఆందోళన మొదలైంది. దళితబంధు వస్తదో లేదో అని దిగులు చెందారు. కాగా, శనివారం ఎరుకలవాడకు దళితబంధు సర్వే కోసం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వచ్చారు. సర్వే బృందంతో కలిసి నేరుగా లక్ష్మి ఇంటి తలుపుతట్టారు. కలెక్టర్ తమ ఇంటికి రావడంతో కుటుంబమంతా ఆశ్చర్యానికి గురయ్యారు. నేలపై కూర్చుని కుటుంబ పెద్ద లక్ష్మితో మాట్లాడారు. నలుగురు కొడుకుల్లో ముగ్గురికి సమగ్ర కుటుంబ సర్వేలో పేర్లు లేవని తెలుసుకున్నారు. వెంటనే ఫారాలు తెప్పించి, అప్పటికప్పుడే దళితబంధు సర్వేలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో లక్ష్మి కుటుంబం మురిసిపోయింది. దళిత వాడ సంబుర పడింది. అంతకు ముందు కలెక్టర్ హుజూరాబాద్ పట్టణంలోని ఎస్డబ్ల్యూకాలనీ, గాంధీనగర్, ఇందిరానగర్లోనూ డోర్‌టూ డోర్ సర్వేను పరిశీలించారు.
రెండో రోజూ కొనసాగిన సర్వే
రెండో రోజు శనివారం సర్వే విజయవంతంగా సాగింది. హుజూరాబాద్ పట్టణంలోని 16, 29, 13వ వార్డులతోపాటు మండలంలోని సింగాపూర్, జూపాక, రాంపూర్, రంగాపూర్, ధర్మరాజుపల్లి గ్రామాల్లో సర్వే చేశారు. జమ్మికుంట పట్టణంలోని 5, 2, 10, 13, 14వ వార్డులతోపాటు మండలంలోని కోరపల్లి, తనుగుల, బిజిగిరి, నాగంపేట, నగురం, వెంకటేశ్వర్లపల్లి, విలాసాగర్ గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఇల్లందకుంట మండలకేంద్రంతోపాటు కనగర్తి, సిరిసేడు, మల్యాల, వీణవంక మండలకేంద్రంతో పాటు బేతిగల్, ఘన్ముక్ల వల్భాపూర్, మామిడాలపల్లి, బొంతుపల్లి, పోతిరెడ్డిపల్లి, కమలపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే కొనసాగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

