కరెంట్ పాపం అధికార్లపై నెపం
తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారు. విద్యుత్తు సంక్షోభానికి అధికారులను బాధ్యులను చేస్తూ, ప్రజలముందు తన తప్పేమీలేదని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్ నినోతో ఈ ఏడాది గడ్డు పరిస్థితులు తలెత్తే ప్రమాదమున్నదని ఆరు నెలల ముందే తెలిసినా సర్కార్ పట్టించుకోలేదు. నదులు నిండుగా పారుతున్నా నీటిని ఎత్తిపోయలేదు. కరెంట్ ఉత్పత్తిపైనా దృష్టి పెట్టలేదు.
- సీఎం రేవంత్ గడుసుతనం
- కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నరు?
- ఉత్పత్తి ఎందుకు పెంచడం లేదు?
- విద్యుత్తు సంక్షోభం, కరువుపై సమీక్షలో అధికారులపై ముఖ్యమంత్రి చిందులు
- స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీని సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులు
- విద్యుత్తు, తాగునీటి సంక్షోభం తప్పదని మరోమారు తేల్చిచెప్పిన సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారు. విద్యుత్తు సంక్షోభానికి అధికారులను బాధ్యులను చేస్తూ, ప్రజలముందు తన తప్పేమీలేదని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్ నినోతో ఈ ఏడాది గడ్డు పరిస్థితులు తలెత్తే ప్రమాదమున్నదని ఆరు నెలల ముందే తెలిసినా సర్కార్ పట్టించుకోలేదు. నదులు నిండుగా పారుతున్నా నీటిని ఎత్తిపోయలేదు. కరెంట్ ఉత్పత్తిపైనా దృష్టి పెట్టలేదు.
సర్కార్ నిర్లక్ష్యం ఫలితాన్ని ఇప్పుడు ప్రజలు అనుభవించాల్సి వస్తున్నది. నీళ్లు లేక పంటలు ఎండుముఖం పట్టాయి. ఎండాకాలం రాకముందే కరెంట్ కోతలతో ప్రజలు సతమతమవుతున్నారు. బొగ్గు సరఫరా లేక పవర్ప్లాంట్లు సామర్థ్యం మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. సంక్షోభం ముందురుతుండడంతో అధికారులపై సీఎం చిందులు తొక్కుతున్నారు. తప్పంతా వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్తు సంక్షోభం, వర్షాభావ పరిస్థితులపై బుధవారం సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయాలపై మండిపడ్డారు. విద్యుత్తు సరఫరా సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో ఎందుకు మార్పు రాలేదని అధికారులను ఆరా తీశారు.
విద్యుత్తు కొరత తలెత్తే ప్రమాదం ఉన్నదని తెలిసినా ఉత్పత్తి ఎందుకు పెంచడంలేదని అధికారులపై మండిపడ్డారు. బొగ్గు కొరత లేకుండా నైనీ, మహానది నుంచి బొగ్గు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి ప్లాంట్లో సామర్థ్యం మేరకు విద్యుత్తు ఉత్పత్తి ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ ఒకరినీ ఉపేక్షించేది లేదని, స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. వెంటనే విద్యుత్తు అంతరాయాలకు కారణాలు తెలియజేయాలని ఆదేశించారు. సచివాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం కానున్నారు. సమావేశంలో ఎల్ నినో, రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

