Skill University | స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు సిద్ధంగా ఉండండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
Skill University | తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీపై సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.
Skill University | తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీపై సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. ఏర్పాటు, నిర్వహణకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించి, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం ముసాయిదాను తయారు చేసిందని తెలిపారు.
ఈ యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిర్వహణకు అవసరమయ్యే నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు. కొత్త యూనివర్సిటీకి ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’ అని పేరు పెట్టాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో (PPP Model) యూనివర్సిటీ నెలకొల్పనున్నారు. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయం నిర్ణయించారు. మూడు, నాలుగేళ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులను ఇందులో నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం ఇందులో 17 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫార్మా, కన్స్‌స్ట్రక్షన్, బ్యాకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ కామిక్స్ రంగాల కోర్సులను మొదట ప్రవేశపెట్టనున్నారు. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరుపొందిన కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఆయా కంపెనీలతో ఎంఓయూ చేసుకోనుంది.
ఇక తొలి ఏడాది 2వేలమందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20వేల మందికి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు (శాటిలైట్ క్యాంపస్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చర్చించారు. ఎక్కువగా హైదరాబాద్ క్యాంపస్‌లో చేరేందుకు పోటీపడే అవకాశం ఉంటుందని.. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈఎస్సీతో పాటు న్యాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలుండే వివిధ ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లోని సదుపాయాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

