నేషనల్ డాక్టర్స్ డే.. వైద్యులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : ప్రతీ ఏడాది జులై 1వ తేదీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో వైద్య నారాయణులై తమవంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని సీఎం పేర్కొన్నారు.
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న గ్రహీత డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ జయంతి, వర్థంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. బిధన్ చంద్రరాయ్ 1 జులై, 1882 న జన్మించారు. 1 జులై 1962 న పరమపదించారు. డాక్టర్ రాయ్ వైద్య రంగంలో ఎనలేని కృషి చేసిన గొప్ప వైద్యుడు. మానవాళికి సేవ చేయడంలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ గౌరవార్థంగా 1991 నుండి డాక్టర్ట్స్ డే ను పాటిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలందరికీ ఈ రోజు అంకితం చేయబడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

