Himanshu Rao | 12వ తరగతి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న హిమాన్షు.. అభినందించిన సీఎం కేసీఆర్ దంపతులు
Himanshu Rao | హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12వ తరగతి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అభినందించి, ఆశీర్వదించారు.
Himanshu Rao | హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12వ తరగతి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అభినందించి, ఆశీర్వదించారు.
గచ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్లో 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ స్కూల్లో చదివిన ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు తన 12వ క్లాస్ గ్రాడ్యేయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నానమ్మలు కేసీఆర్, శోభ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లి అలేఖ్యతో పాటు తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీవిద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలను అందజేసింది. ఇందులో భాగంగా హిమాన్షు రావు కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు గాను వారి ప్రతిభను గుర్తించి, హిమాన్షుకు సీఏఎస్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు.
అయితే గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు నేరుగా తన తాత వద్దకు వచ్చి ఆయన చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి, పాదాలకు నమస్కరించారు. తాత ఆశీర్వాదం తీసుకున్నారు. చిన్నతనం నుంచి తనచేతుల్లో పెరిగి నేడు పట్టభద్రుడిగా ఎదిగిన మనుమన్ని హృదయపూర్వకంగా అభినందించారు సీఎం కేసీఆర్. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని సీఎం ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు తమ కుమారుడు సాధించిన ప్రతిభానైపుణ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ, మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హిమాన్షు రావుతో పాటు తన క్లాస్మేట్ ఆద్విత్ బిగాల కూడా గ్రాడ్యుయేషన్ పట్టాను పొందారు. బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల కుమారుడే ఆద్విత్ బిగాల. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా పాల్గొన్నారు.
గ్రాడ్యుయేషన్ డే సంద్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో సమావేశ మందిరం కిక్కిరిసింది. విద్యార్థుల హర్షధ్వానాలతో ప్రాంగణం మార్మోగిపోయింది.
ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12వ తరగతి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అభినందించి, ఆశీర్వదించారు.@TheRealHimanshu pic.twitter.com/d4z47sbwhU
— Namasthe Telangana (@ntdailyonline) April 18, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

