CM KCR Birthday | చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ఎయిర్పోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, కేసీఆర్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్.. లాంగ్ లివ్.., జై కేసీఆర్ అనే నినాదాలతో రేణిగుంట ఎయిర్పోర్టు దద్దరిల్లిపోయింది. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు. అనంతరం ఎయిర్పోర్టు వెలుపల కేసీఆర్ అభిమానులు కవిత చేత కేక్ కట్ చేయించారు.
రేణిగుంట ఎయిర్పోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం.. కేసీఆర్.. లాంగ్ లివ్.., జై కేసీఆర్ అంటూ నినాదాలు.. @RaoKavitha pic.twitter.com/qu7JPmUnAs
— Namasthe Telangana (@ntdailyonline) February 17, 2022