అక్టోబర్‌లో క్లాసులు

- సెప్టెంబర్ 30లోపు డిగ్రీ, పీజీ ప్రవేశాలు
- ఫైనల్ ఇయర్ పరీక్షలు తప్పనిసరి
- వచ్చేనెల 31లోపు పరీక్షలు జరగాలి
- వర్సిటీలు, కాలేజీలకు యూజీసీ ఆదేశం
- 2021-22 విద్యాసంవత్సరానికి మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ, జూలై 17: దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభమవుతాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. సెప్టెంబర్ 30నాటికి అన్ని కాలేజీల్లో డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. విద్యార్థులకు చివరి ఏడాది పరీక్షలను ఆగస్టు 31లోపు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఆయా రాష్ర్టాల బోర్డు ఫలితాలు విడుదల అయ్యాకనే అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను మొదలుపెట్టాలన్న యూనివర్సిటీలు, ఉన్నతవిద్యా సంస్థల విజ్ఞప్తులను ఈ మేరకు పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. ‘జూలై 31లోపు 12వ తరగతికి సంబంధించిన ఫలితాలను అన్ని స్కూల్ బోర్డులు ప్రకటిస్తాయని భావిస్తున్నాం. ఒకవేళ ఈ ఫలితాల్లో జాప్యం జరిగితే, ఆయా విద్యాసంస్థలు కొత్త విద్యాసంవత్సరాన్ని అక్టోబర్ 18 నుంచి ప్రారంభించుకోవచ్చు’ అని యూజీసీ వివరించింది.
- సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇతర బోర్డు ఫలితాలు ఆలస్యమైతే, విద్యాసంస్థలు కొత్త విద్యాసంవత్సరాన్ని అక్టోబర్ 18 నుంచి ప్రారంభించవచ్చు.
- అక్టోబర్ 31లోపు అడ్మిషన్‌ను రద్దు చేసుకున్నవారికి పూర్తి ఫీజును తిరిగిచ్చేయాలి. నవంబర్ 1- డిసెంబర్ 31 మధ్య అడ్మిషన్ రద్దు చేసుకుంటే రూ.1000 ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేసి, మిగతా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలి.
- మిగిలిపోయిన సీట్లను అక్టోబర్ 31 వరకు భర్తీ చేసుకోవచ్చు. అడ్మిషన్ అర్హతకు సంబంధించిన పత్రాలను డిసెంబర్ 31 వరకు స్వీకరించవచ్చు.
కొత్త మార్గదర్శకాలు ఇవే
- అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం.
- సెప్టెంబర్ 30నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి.
- ఆగస్టు 31లోపు చివరి ఏడాది పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ పరీక్షలను ఆన్లైన్, ఆఫ్‌లైన్, బ్లెండెడ్ మోడ్ (ఆన్లైన్+ఆఫ్‌లైన్)లో నిర్వహించవచ్చు.
- కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ అక్టోబర్ 1-జూలై 31 మధ్య.. కాలేజీలు, యూనివర్సిటీలు క్లాసుల నిర్వహణ, పరీక్షలు, సెమిస్టర్ బ్రేక్‌ను పూర్తిచేయాలి. ఆఫ్‌లైన్, ఆన్లైన్, బ్లెండెడ్ మోడ్ మాధ్యమాల ద్వారా క్లాసులను నిర్వహించాలి.
- గత సెమిస్టర్ ఫలితాలు (50% మార్కులు), ఇంటర్నల్‌గా నిర్వహించిన అసెస్మెంట్ (50 % మార్కులు) ఆధారంగా ఇంటర్మీడియట్ సెమిస్టర్ విద్యార్థుల (1, 2వ సంవత్సరం విద్యార్థులు) మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేయాలి. వీరికి ఫైనల్ పరీక్షలు అవసరంలేదు. ఈ విద్యార్థుల క్లాసులను ఆఫ్‌లైన్, ఆన్లైన్, బ్లెండెడ్ మోడ్‌లో ప్రారంభించాలి.
- కొవిడ్-19 ఆంక్షలు విధించిన ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఈ ఆదేశాలను పాటించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

