Hanumakonda | భీమదేవరపల్లిలో కారును ఢీకొట్టిన లారీ.. పాస్టర్ దుర్మరణం
హనుమకొండ (Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ముల్కనూరు-ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఓ చర్చి పాస్టర్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగంగా నుజ్జునుజ్జు అయింది.
భీమదేవరపల్లి, మార్చి 25: హనుమకొండ (Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ముల్కనూరు-ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఓ చర్చి పాస్టర్ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగంగా నుజ్జునుజ్జు అయింది.

గోదావరిఖనికి చెందిన కనకపుడి కరుణాకర్ కరీంనగర్‌లోని ఓ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున హనుమకొండ నుంచి కరీంనగర్‌కు తన కారులో బయల్దేరారు. అయితే హుజూరాబాద్ రహదారిలో రోడ్డు పనులు జరుగుతుండటంతో హుస్నాబాద్ నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో గోపాల్పూర్ క్రాసింగ్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ.. కారును డీ కొట్టింది. దీంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అవడంతో కరుణాకర్ అందులోనే ఇరుక్కుపోయారు. లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.
కాగా, రోడ్డుపై వెళ్తున్న ప్రయాణీకులు పోలీసులకు, 108కి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతికష్టంపై మృతదేహాన్ని అందులోనుంచి బయటకు తీశారు. మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని, లారీ డ్రైవర్ నిద్ర మత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

