చమన్‌సింగ్, సంగిశెట్టిలకు మల్లావఝల స్మారక పురసారం
ప్రతిష్ఠాత్మక మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారానికి ప్రముఖ కవి, కథా రచయిత చమన్‌సింగ్ (202425), ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ (202526) ఎంపికయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు.
- 3న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రదానం
- వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ దేశపతి
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారానికి ప్రముఖ కవి, కథా రచయిత చమన్‌సింగ్ (202425), ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ (202526) ఎంపికయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు. వచ్చే నెల 3న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖ రచయిత్రి తిరునగరి దేవకీదేవి, గాయకుడు కవ్వంపల్లి స్వామికి అదే వేదికపై ప్రత్యేక సతారం చేయనున్నట్టు పేరొన్నారు.
మల్లావఝల ప్రజాకవి
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో మల్లావఝల సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి.. నా చేను నా చెలక ఎడారి’ గీతం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కండ్లకు కట్టిందని దేశపతి శ్రీనివాస్ గుర్తుచేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా రాసిన ‘ఎన్నాళ్లు ఈ వెలివేత’.. పోలీసుల వేధింపులతో వలసబాట పట్టిన యువత గోసను తెలిపే ‘ఏమున్నదకో.. ఏమున్నదకా..’.. వరకట్న దురాచారానికి బలైపోయిన ఆడపడుచుల వేదనను వినిపించిన ‘పారాణి ఆరలేదు చెల్లెలా’ వంటి ఎన్నో విప్లవాత్మక పాటలు ఆయన కలం నుంచి జాలువారి సమాజంలో చైతన్యాన్ని రగిలించాయని తెలిపారు. ప్రజల బాధలను గొంతుకగా మార్చుకున్న ప్రజాకవి మల్లావఝల అని కొనియాడారు.
సాహితీ సేవకులకే ఈ అవార్డులు
అణగారిన వర్గాల పక్షాన నిలిచి సాహిత్యం సృష్టించిన ప్రజా కవులను గౌరవించేందుకే ఏటా ఈ పురసారాన్ని అందజేస్తున్నామని, ఇప్పటివరకు దాదాపు 90 శాతానికిపైగా దళిత, బహుజన రచయితలకే ఇది దకిందని సమితి అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మల్లావఝల విజయానంద్ చెప్పారు. గతంలో గూడ అంజన్న, జయరాజు, గోరటి వెంకన్న, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, విమలక, నిస్సార్, మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న వంటి ఎందరో ప్రజాకవులకు ఈ గౌరవం దకిందని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

