ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షలు
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని కొనియాడారు.
- వెల్లువెత్తిన ట్వీట్లు
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తె లంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
వారసత్వానికి నెలవు
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. 2014లో ఇదేరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ అందమైన రాష్ట్రం. గొప్ప సాంస్కృతిక వారసత్వంతోపాటు ప్రతిభ కలిగి ఉంది. ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్షిప్లకు తెలంగాణ హబ్‌గా మారుతున్నది. ఈ ప్రగతిని, స్ఫూర్తిని ఇదే రీతిన కొనసాగించాలి.
-ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
తెలంగాణ ప్రగతి భేష్
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం అతి స్వల్పకాలంలో తన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టుకోవడంతోపాటు ఎలుగెత్తి చాటుతున్నది. అన్ని రంగాల్లో ఊహించని రీతిలో అభివృద్ధిని సాధించడంతోపాటు భారత అభివృద్ధికి దోహదపడుతున్నది. తెలంగాణ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
– జగ్దీప్ ధన్కర్, ఉపరాష్ట్రపతి
సంస్కృతి గొప్పది
తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. తెలంగాణ ప్రజల నైపుణ్యాలు ప్రశంసించదగ్గవి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా.
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఆనందాన్ని పంచాలి
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం తన ప్రగతి ప్రస్థానాన్ని ఇదేరీతిన కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర ప్రజలకు విజయం, ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నా.
-ఓం బిర్లా, లోకసభ స్పీకర్
ప్రజలు కార్యసాధకులు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు కార్యసాధకులు. రాష్ట్ర గొప్ప చరిత్ర, సంస్కృతిని తీర్చిదిద్దుకొన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.
-అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
ఆకాంక్ష నెరవేరిన రోజు
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది. రాష్ట్ర ప్రజల కల సాకారమై రాష్ట్రం సిద్ధించింది. వారి కల నెరవేర్చినందుకు అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ గర్విస్తున్నది. తెలంగాణ ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
-మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు
ఇలాగే ముందుకెళ్లాలి
తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ ఆ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. చిన్న రాష్ట్రమైనా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ ప్రగతి ప్రస్థానం ఇలాగే ముందుకుసాగాలని కోరుకుంటున్నా.
-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణ ప్రజలు కష్టజీవులు
తెలంగాణ ప్రజలు కష్టజీవులు. దేశంలోనే అతి తక్కువ వయసున్న రాష్ట్ర పురోగతికి నిరంతరం శ్రమిస్తున్న ప్రజలు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-హర్దీప్సింగ్ పురి, కేంద్ర మంత్రి
ప్రగతిశీల రాష్ట్రం
తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రం. త్వరలోనే హైదరాబాద్‌లో ఫ్రాన్స్ బ్యూరోను ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
– లెనిన్, ఫ్రాన్స్ అంబాసిడర్
ఆశలన్నీ నెరవేరాలి
ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. వారి ఆశయాలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నా.
– చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

