BRS Ireland | బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఐర్లాండ్ కమిటీ ఏర్పాటు
BRS Ireland | బీఆర్ఎస్ ఎన్నారై విభాగంలో భాగంగా ఐర్లాండ్ అధికారిక కమిటీని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఏర్పాటు చేశారు.
BRS Ireland | బీఆర్ఎస్ ఎన్నారై విభాగంలో భాగంగా ఐర్లాండ్ అధికారిక కమిటీని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 52 దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై సెల్లు విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా, ఐర్లాండ్ 53వ దేశంగా బీఆర్ఎస్ ఎన్నారై విభాగంలో చేరింది. దీనికి సంబంధించి 2025–2027 సంవత్సరాల అధికారిక కమిటీని మహేష్ బిగాల ఈ రోజు ప్రకటించారు.
తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన పరిపాలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ప్రేరణగా నిలుస్తోందని, ఇటీవల డల్లాస్లో ఘనంగా నిర్వహించిన గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై మహాసభల అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కొత్త దేశాల్లో ఎన్నారై కమిటీల ఏర్పాటు కోసం భారీగా అభ్యర్థనలు వస్తున్నాయని మహేష్ బిగాల తెలిపారు.
ఐర్లాండ్ కమిటీ సభ్యుల వివరాలు..
అధ్యక్షుడు : కిరణ్ అనుగుర్తి
ఉపాధ్యక్షులు: విశాల్ శిరంశెట్టి, నితిష్ చిలువేరి
ప్రధాన కార్యదర్శి: పవన్ అనుగుర్తి
సలహా బోర్డు ఛైర్మన్లు: అజయ్ పొలంపల్లి, లింగమూర్తి
సలహా బోర్డు వైస్ ఛైర్మన్: ఉమేష్ చిప్ప
సలహా బోర్డు సభ్యులు: చాను బోయిని, సూర్య చందన్, నవీన్ కుమార్ కొండిజు
కార్యదర్శులు: రాకేష్ లెసాని, అన్వేష్ రెడ్డి, నోమాన్ సయ్యద్
ఐటీ, మీడియా & పీఆర్ కార్యదర్శి: సాయి మనీష్ తాటికొండ
ట్రెజరర్: ఉమేష్ చిప్ప, ప్రదీప్ గౌడ్
కమ్యూనిటీ వ్యవహారాల ఛైర్మన్: దినేష్ నంపల్లి
కమ్యూనిటీ వ్యవహారాల ఉపాధ్యక్షుడు: పవన్ కళ్యాణ్ చిర్రం
అధికార ప్రతినిధులు: రామకృష్ణ వేణిరెడ్డి, ఉమేష్ చిప్ప
సోషల్ మీడియా ఇన్చార్జ్లు: పవన్ అనుగుర్తి, దిలీప్ రెడ్డి గోపు
సభ్యత్వ కోఆర్డినేటర్: అభినవ్ గడ్డం
ఈ కమిటీ ఐర్లాండ్లో బీఆర్ఎస్ సిద్ధాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడమే కాకుండా, స్థానిక కమ్యూనిటీలో తెలంగాణ సంస్కృతి, సేవా కార్యక్రమాలను విస్తృతంగా బలోపేతం చేయనుందని మహేష్ బిగాల తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS Ireland
- BRS NRI Cell
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

