ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి
పట్టభద్రుల ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గులాబీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు లో నియోజకవర్గస్థాయి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యకర్తల సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడు మందుల సత్యం అధ్యక్షతన నిర్వహించారు.
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
మునుగోడు, అక్టోబర్15: పట్టభద్రుల ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గులాబీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు లో నియోజకవర్గస్థాయి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యకర్తల సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడు మందుల సత్యం అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి కూసుకుంట్ల మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త సైనికులా కష్టపడాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి 50 మంది పట్టభద్రులకు ఒక కార్యకర్తను సమన్వయకర్తగా నియమించి, ఓటర్ల నమోదును పర్యవేక్షించేలా ప్రణాళిక రుపొందించుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదివి పైన ఉన్న సోయి,నియోజకవర్గ అభివృద్ధిపైలేదని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని మునుగోడు నియోజకవర్గానికి తీసుకొచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు. మునుగోడు ప్రజల నీటి హక్కుల సాధన కోసం శివన్నగూడెం రిజర్వాయర్‌పై మహాధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని కదిలిస్తామని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

