KCR | విజయకాంత్ మరణం పట్ల కేసీఆర్ సంతాపం
KCR | ప్రముఖ తమిళ నటుడు డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ వేత్తగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. విజయకాంత్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
KCR | ప్రముఖ తమిళ నటుడు డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ వేత్తగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. విజయకాంత్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. 71 ఏండ్ల విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి. అయితే ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు. అయితే రెండు వారాలు గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్.. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

