మరో ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్
పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్‌కు చెందిన కార్మికుడు మూల శ్రీనివాస్‌రెడ్డికి త్రీవగాయాలయ్యాయి.
- కార్మికుడికి తీవ్రగాయాలు, చికిత్స, పరిస్థితి విషమం
- పరిశ్రమలో భద్రతాలోపమే ఈ పేలుడుకు కారణమా?
- కంపెనీ యజమాన్యంపై పోలీసుల కేసు నమోదు
మేడ్చల్, జూలై1 (నమస్తే తెలంగాణ): పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్‌కు చెందిన కార్మికుడు మూల శ్రీనివాస్‌రెడ్డికి త్రీవగాయాలయ్యాయి. కంపెనీలో పనిచేస్తున్న సమయంలోనే బాయిలర్ పేలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పేలుడు శబ్దానికి దూరంగా ఉన్న ఇతర కార్మికులు వచ్చి బాధితుడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రసుత్తం అతని పరిస్థితి విషమంగానే ఉన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ శంకర్‌రెడ్డి తెలిపారు.
తొలుత ఈ పేలుడు ఘటనను అల్కలాయిడ్ ఫార్మా కంపెనీ యజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం అనేక అనుమనాలు కలిగిస్తున్నది. కంపెనీలో గత కొన్నేండ్లుగా వినియోగిస్తున్న బాయిలర్‌ను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం మూలంగానే ఈ పేలుడు ఘటన జరిగిందన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు సమయంలో సమీపంలో కార్మికులు ఎవరూ లేని కారణంగా పెనువిపత్తు తప్పింది. ఈ కంపెనీలో 150 మంది షిప్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారు. పేలుడు సమయంలో కంపెనీలో 70 మంది పనులు చేస్తున్నట్టు తెలిసింది.
బాయిలర్ వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఒక్కడే పనులు చేస్తాడని ఇతర కార్మికుల ద్వారా తెలిసింది. అత్యధిక వేడి వల్లే బాయిలర్ పేలిందని కార్మికులు అనుకుంటున్నారు. కంపెనీలో సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలేదని కార్మికులు, వారి కుటంబాలు ఆరోపిస్తున్నాయి. పాశమైలారం, మేడ్చల్ ఘటనలతో కార్మికులు ఆందోళన చెందున్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భద్రతా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వం పర్యవేక్షించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

