కమలంలో కుమ్ములాట!.. ఇదే అంశంపై రాష్ట్ర అధ్యక్షుడి ఇంట్లో నేతల భేటీ
రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. సొంతపార్టీ నేతలే ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతుండటం పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నది.
- స్టేట్చీఫ్ రామచందర్‌రావు వర్సెస్ ఎంపీ అర్వింద్
- తనపై ఫిర్యాదులు చేయొద్దని అర్వింద్ వార్నింగ్
- ఇకనైనా కలిసి పనిచేయాలని నేతలకు లక్ష్మణ్ సూచన
హైదరాబాద్, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. సొంతపార్టీ నేతలే ఒకరిపై మరొకరు కయ్యానికి కాలు దువ్వుతుండటం పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేరు ప్రస్తావించి మరీ.. ‘హలో రామచందర్‌రావు.. ప్రచారానికి రావడం లేదని తనపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయొద్దు’ అనడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రామచందర్‌రావు పేరు ప్రస్తావించిన నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న అర్వింద్, నేరుగా ఆయన పేరు ప్రస్తావించి విమర్శించడంపై సొంత పార్టీ నేతలే షాక్‌కు గురయ్యారు. ఈ వివాదం ముదిరితే పార్టీకి మరింత డ్యామేజీ తప్పదని భావించి గొడవ సద్దుమణిగేందుకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మధ్యవర్తిత్వం వహించారు. శనివారం రామచందర్‌రావు ఇంట్లో లంచ్ మీటింగ్ ఏర్పాటుచేయగా, ఇద్దరు నేతల మధ్య వివాదం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇక నుంచైనా కలిసి పనిచేయాలని, లేకపోతే పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని ఇరువురు నేతలకు లక్ష్మణ్ సర్దిచెప్పినట్లు సమాచారం.
బండి వర్సెస్ ఈటల
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కకపోవడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉండగా, ఇవేమీ తమకు పట్టవన్నట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓటమిపై విరుద్ధ వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఒకే జిల్లాకు చెందిన నేతల మధ్య మొదటి నుంచీ ఆధిపత్యపోరు నడుస్తుండగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇరువురు తమ పట్టును నిలుపుకునేలా ఎవరికివారు పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్ర పార్టీలో ఇద్దరు కీలకనేతల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంటే, వారిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేకపోవడంపై సొంతపార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఈ పరిణామాలన్నీ స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

