జూరాల ఆయకట్టుకు నీళ్లియ్యండి
జూరాల చివరి ఆయకట్టు డీ-37 కాలువ ద్వారా రైతాంగానికి సాగునీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. విద్యుత్తు కోతలు, నీటి సమస్య కారణంగా చివరి దశలో ఉన్న పంటలు చేతకందే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్
- గోప్లాపురం, శింగవరంలో ఎండిన పంటల పరిశీలన
పెంట్లవెల్లి, అక్టోబర్ 19 : జూరాల చివరి ఆయకట్టు డీ-37 కాలువ ద్వారా రైతాంగానికి సాగునీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. విద్యుత్తు కోతలు, నీటి సమస్య కారణంగా చివరి దశలో ఉన్న పంటలు చేతకందే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపురం, శింగవరం గ్రామాల్లో ఎండిన పంటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో మాజీ ఎమ్మెల్యే బీరం సైతం భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటలు ఏపుగా పెరిగి దిగుబడి చేతికొచ్చే సమయంలో నీరు అందక ఎండిపోవడం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చిందని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలే కనిపిస్తున్నాయని, రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.
రైతాంగానికి సాగునీరు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం వల్లే అన్నదాతలు రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోపల్‌దిన్నె-సింగోటం లింక్ కెనాల్ పనులు ప్రారంభించామని, ఆ పనులు పూర్తయి ఉంటే రైతులకు సాగునీరు అందేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన సాగునీరు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రైతుల సమష్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వెంటనే గోపల్‌దిన్నె – సింగోటం లింక్ కెనాల్ పనులను పూర్తి చేసి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని సూచించారు. అంతకుముందు ఆయన జూరాల ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని అందించాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

