బీబీఏవాళ్లూ బీఈడీలో చేరొచ్చు

- కెమిస్ట్రీ ఒక్కటే చదివినా ఫిజికల్ సైన్స్‌లో ప్రవేశాలు
- ఎడ్‌సెట్‌లో మార్పులు.. వచ్చేవారం నోటిఫికేషన్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌లో మార్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెథడ్స్‌ను రద్దుచేసి, అందరికీ ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా బీబీఏ కోర్సు చదివినవారు కూడా బీఈడీలో చేరేందుకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఎడ్‌సెట్‌లో మార్పులపై ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు న్యాయశాఖను ఉన్నత విద్యా మండలి అధికారులు సంప్రదించారు. న్యాయశాఖ కూడా ఒకే చెప్పడంతో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యాశాఖ ఎడ్‌సెట్ ప్రవేశాల కోసం గతంలో జారీచేసిన జీవో-13ను సవరించి కొత్త జీవో జారీచేయాల్సి ఉన్నది. ఆ జీవో రాగానే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు.
మార్పులివే..
- డిగ్రీలో బీబీఏ కోర్సు చదివినవారికి ప్రస్తుతం బీఈడీలో చేరే అవకాశం లేదు. తాజాగా వారుకూడా బీఈడీ సోషల్స్టడీస్ మెథడ్‌లో ప్రవేశాలు పొందొచ్చు.
- సాధారణ డిగ్రీ అభ్యర్థులు బీఈడీలో చేరాలంటే డిగ్రీలో 50% మార్కులు వస్తే సరిపోతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు మాత్రం 55% మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన ప్రస్తుతం ఉన్నది. ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా 50% మార్కులే అర్హతగా నిర్ణయించారు.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్‌తో డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఇప్పటివరకు బీఈడీ భౌతికశాస్త్రం మెథడ్‌లో ప్రవేశాలు కల్పించేవారు. ఇప్పుడు డిగ్రీలో కెమిస్ట్రీ ఒక్క సబ్జెక్ట్ చదివినా భౌతికశాస్త్రం మెథడ్‌గా తీసుకోవచ్చు. ఇటీవల భౌతికశాస్త్రం లేకుండా పలు కాంబినేషన్లతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చినందున ఈ సడలింపు ఇచ్చారు. బీఎస్సీ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ బాటనీ-జువాలజీ, కెమిస్ట్రీ తదితర 46 కోర్సు ల విద్యార్థులు కూడా బీఈడీలో ఫిజిక్స్ మెథడ్‌లో చేరవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BBA
- Bed degree
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

