బంగాళాఖాతంలో వాయుగుండం
ఆగ్నేయ, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 5 కి.మీ వేగంతో కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేం దం తెలిపింది.
- పలు జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 5 కి.మీ వేగంతో కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేం దం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి ఇది విశాఖకు 870 కి.మీ, కాకినాడకు 960 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించింది. ఈ తుఫాను సోమవారం బలపడే అవకాశమున్నదని హెచ్చరించింది. ఈ వాయుగుండం 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడుతుందని తెలిపింది.
ఈ క్రమంలో 28న ఈ వాయుగుండం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశమున్నదని పేర్కొన్నది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 115-125 కి.మీ వేగంతో ఈదురుగాలు లు వీస్తాయని వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అకడకడ తేలికపాటి వర్షాలు కురవవచ్చని, 27న కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాచ లం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి.. చలి క్రమంగా పెరుగుతున్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండ్రోజులు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశమున్నదని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉన్నదని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శివారు ప్రాం తాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరవచ్చని పేర్కొన్నారు. వాతావరణంలో జరిగిన ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

