నేటి నుంచి సర్కారు సారె
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సర్కారు సారె సిద్ధం చేసింది. ప్రతి ఇంటా ఆడబిడ్డలు ఆనందంతో ఉండేలా ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ గురువారం నుంచి ప్రారంభించనున్నట్టు పరిశ్రమలు,చేనేత, జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
- బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు
- ఆడపడుచులకు ప్రభుత్వ చిరుకానుక
- వివిధ రంగులు, తీరొక్క డిజైన్లతో తయారీ
- చేనేత కార్మికులకు చేతినిండా పని
- ఈ ఏడాది రూ.339.73 కోట్ల వ్యయం
- పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సర్కారు సారె సిద్ధం చేసింది. ప్రతి ఇంటా ఆడబిడ్డలు ఆనందంతో ఉండేలా ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ గురువారం నుంచి ప్రారంభించనున్నట్టు పరిశ్రమలు,చేనేత, జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనివ్వడంతోపాటు ఆడబిడ్డలకు చిరుకానుక ఇవ్వాలన్న మహోన్నత లక్ష్యంతో 2017లో చీరల పంపిణీ ప్రారంభించినట్టు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని..ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చేనేత శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, కేంద్రం టెక్స్టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తూ వారి బతుకుల్ని ఆగం చేస్తున్నదని మంత్రి విమర్శించారు.
10 రంగులు.. 24 రకాల డిజైన్లు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. 24 రకాల డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయ రంగులు, 240 రకాల త్రెడ్బోర్డర్ (దారపు పోగుల అంచులు)తో 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను తయారు చేశారు. ఆరు మీటర్ల (5.50+1.00) పొడవుతో 92 లక్షల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవుగల చీరలు 8 లక్షలు తయారు చేయించారు. మొత్తంగా కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందించనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.339.73 కోట్లు ఖర్చు చేసింది. కార్యక్రమం ప్రారంభించిన 2017 నుంచి నేటి వరకు(ఈ ఏడాది చీరలతో కలుపుకొని) 5.81 కోట్ల చీరలను తెలంగాణ ఆడబిడ్డలకు అందించినట్టవుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

