హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తనయుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో వెంటనే బండి సంజ య్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన పదవిలో కొనసాగితే విచారణ ప్రభావితయ్యే అవకాశమున్నదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజానికి దారి చూపాల్సిన వ్యక్తి కొడుకు దారి తప్పడం దురదృష్టకరమని అన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరిపి బాలికకు న్యాయం చేయాలని కోరారు.