తమ్మిడిహట్టి డీపీఆర్ బయటపెట్టండి
తమ్మిడిహట్టి ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ డిమాండ్ చేశారు. రైతులు సాగునీరు, విద్యుత్తు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటుంటే, వారి సమస్యలను పకదారి పట్టించేందుకే ఈ ప్రభుత్వం తమ్మిడిహట్టి పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు.
- సర్కార్‌వి డైవర్షన్ పాలిటిక్స్
- రైతు సమస్యలు దారిమళ్లించే కుట్ర
- మహారాష్ట్రతో చర్చించి ఏం సాధించారో చెప్పండి
- మాజీ ఎమ్మెల్యే బాల్క ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ డిమాండ్ చేశారు. రైతులు సాగునీరు, విద్యుత్తు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటుంటే, వారి సమస్యలను పకదారి పట్టించేందుకే ఈ ప్రభుత్వం తమ్మిడిహట్టి పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్, ఉన్నతాధికారులు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, దాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తారు? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతానికి నీళ్లు అందిస్తామని ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడమేనని మండిపడ్డారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసిందని పేరొంటూ, అకడ నిర్మించే ప్రాజెక్టుకు నీళ్లు ఎకడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కిందికి వదిలేశారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను ఆన్‌చేసి ఉంటే ఆ రెండు ఉమ్మడి జిల్లాలకు సాగునీరు అందేదని చెప్పారు.
సీతారామ నుంచి ఎన్ని నీళ్లు ఎత్తిపోశారు?
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎన్ని నీళ్లు ఎత్తిపోశారు? అకడ నీటి లభ్యత ఎంత ఉన్నది? అనే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని బాల సుమన్ డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టులో ఎన్ని మోటర్లు ఆన్ చేశారు? ఎంత నీటిని ఎత్తిపోశారో వెల్లడించాలని కోరారు. వరి విత్తనాలు విక్రయించవద్దంటూ విత్తన దుకాణాలకు నోటీసులు ఇవ్వడం, విత్తనాలు కొనుగోలు చేసే రైతుల నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రాలు కోరడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం సరికాదని హితవుపలికారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బాల సుమన్ ఆరోపించారు. రాష్ట్రంలో కరువును ఎదురొనే లక్ష్యంతోనే కేసీఆర్ నాడు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. మేడిగడ్డ బరాజ్ మరమ్మతులపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదికను హడావుడిగా తెప్పించిన బీజేపీ.. మరమ్మతుల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదని నిలదీశారు. మేడిగడ్డ నుంచి నీటిని అందించకపోవడంలో కాంగ్రెస్‌కు ఎంత బాధ్యత ఉన్నదో, బీజేపీకీ అంతే బాధ్యత ఉన్నదని స్పష్టంచేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా బీజేపీ నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్‌ను విమర్శించడానికే పరిమితమవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నాయని ఆక్షేపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ మద్దతుగా నిలుస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ భరోసా.. రేవంత్ భయాందోళన
నాడు కరోనా విపత్తు సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు భరోసా కల్పించారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ప్రజల్లో భయాందోళనలు కల్పిస్తున్నారని బాల సుమన్ విమర్శించారు. రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భద్రతా సిబ్బంది లేకుండా నేరుగా పొలాల వద్దకు వెళ్లగలరా? అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ పొలాల వద్దకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రచారానికి పరిమితం కాకుండా రైతులకు సాగునీరు, విద్యుత్తు అందించడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

