ప్రపంచ చేనేత దినోత్సవంగా ఆగస్టు 7ను ప్రకటించాలి
ఆగస్టు 7వ తేదీని ప్రపం చ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న బుధవారం ఓ లేఖ రాశారు.
- పద్మశాలి సంఘం చేనేత విభాగం
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆగస్టు 7వ తేదీని ప్రపం చ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న బుధవారం ఓ లేఖ రాశారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం లో భాగంగా ప్రజలు విదేశీ, యాంత్రిక వస్త్రాలను బహిషరించారని, దానిని ప్రేరణగా తీ సుకుని భారత ప్రభుత్వం 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు.
ప్రపంచంలో చమురు పరిశ్రమ తర్వాత అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నది టెక్స్టైల్ పరిశ్రమేనని, మొత్తం కాలుష్యంలో 20 శాతానికి టెక్స్టైల్ పరిశ్రమే కారణమని పేర్కొన్నారు. దీనికి సరైన ప్రత్యామ్నాయం చేనేత పరిశ్రమేనని తెలిపారు. చేనేత కళాకారులు సహజమైన దారాలను, రంగులనే ఉపయోగిస్తారని, నేత వస్ర్తాల తయారీకి విద్యుత్తు కూడా అవసరం లేకపోవడంతో పర్యావరణానికి హాని జరగదని వివరించారు. ప్రపంచ చేనేత దినోత్సవం అనే భావన అనేక దేశాల్లో విసృ్తతంగా ప్రాచుర్యం పొందిందని, ప్రపంచవ్యాప్తంగా చేనేతను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

