నకిలీ జీపీఏల సృష్టికర్తల అరెస్టు
నకిలీ పత్రాలు సృష్టించి భూ యజమానులను మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన పొలిశెట్టి మల్లికార్జున్, కందుకూరు గ్రామానికి చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, జూబ్లీహిల్స్‌కు చెందిన వడలా రాజేంద్రనాధ్, పుప్పాల్‌గూడకు చెందిన ఎడిక మంజునాథ్‌రెడ్డి నకిలీ ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ’ పత్రాలు సృష్టించారు.
- 37 ఎకరాలను కాజేసేందుకు స్కెచ్
- భూ యజమానులను మోసం చేసినకేసులో నలుగురు నిందితుల అరెస్టు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- రంగారెడ్డి జిల్లా కందుకూరులో వెలుగులోకి..
కందుకూరు, ఆగస్టు 25: నకిలీ పత్రాలు సృష్టించి భూ యజమానులను మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌కు చెందిన పొలిశెట్టి మల్లికార్జున్, కందుకూరు గ్రామానికి చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, జూబ్లీహిల్స్‌కు చెందిన వడలా రాజేంద్రనాధ్, పుప్పాల్‌గూడకు చెందిన ఎడిక మంజునాథ్‌రెడ్డి నకిలీ ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ’ పత్రాలు సృష్టించారు. కందుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 151,152, 153,165,166లో ఉన్న 31 ఎకరాల 36 గుంటల భూమికి సంబంధించిన యజమానుల సంతకాలను ఫోర్జరీ చేశారు.
భూ యజమానుల అనుమతి లేకుండానే ఫోర్జరీ సంతకాలతో ‘డెవలప్మెంట్, అగ్రిమెంట్ కమ్ ఇర్రెవొకబుల్ జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీ’ని సృష్టించారు. సదరు భూ యజమానులు ఆ భూములను అభివృద్ధి చేసేందుకు, లే అవుట్ వేసేందుకు తమకు అనుమతి ఇచ్చారంటూ నకిలీ పత్రాలు సృష్టించారు. కందుకూరు గ్రామానికి చెందిన ఐనవోలు శ్యాంసుందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయడంతో ఈ వ్యవహారం బయటపడిందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

