అర్నాబ్ తుఫాను తీవ్రరూపం
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాను రెండు తెలుగు రాష్ర్టాలను కలవరపెడుతున్నది. ఈ మేరకు వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి అర్నాబ్ తుఫాన్‌గా మారి గం టకు 15 కి.మీ. వేగంతో కదులుతున్నదని తెలిపింది. ఇది విశాఖపట్నానికి 650 కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నానికి 830 కి.మీ., బాపట్ల కు 910 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొన్నది.
- రేపు బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
- మూడు రోజులు భారీ వర్షాలు
- హెచ్చరించిన వాతావరణ శాఖ
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాను రెండు తెలుగు రాష్ర్టాలను కలవరపెడుతున్నది. ఈ మేరకు వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి అర్నాబ్ తుఫాన్‌గా మారి గం టకు 15 కి.మీ. వేగంతో కదులుతున్నదని తెలిపింది. ఇది విశాఖపట్నానికి 650 కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నానికి 830 కి.మీ., బాపట్ల కు 910 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొన్నది. మంగళవా రం అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి, బుధవారం ఉదయం బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నదని తెలిపిం ది. దీని ప్రభావంతో రెండు తెలుగు రా ష్ర్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఈనెల 27, 28, 29వ తేదీల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతా ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

