ముఖ్యనేత కనుసన్నల్లో హెచ్ఎండీఏ టెండర్లు !
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగుతున్న టెండర్ల వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల పనుల ముసుగులో నచ్చినోళ్లకు టెండర్లు కట్టబెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే ప్లాన్ అమలుచేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపాదించిన 9 రోడ్లలో ఇప్పటివరకు రెండింటికి టెండర్లు ఖరారు చేయగా..
- ‘గ్రీన్‌ఫీల్డ్’ పనుల్లో మొదలైన అక్రమాలు
- సీఎం రమేశ్‌కు టెండర్ల యత్నాల అడ్డగింత
- ‘బుద్వేల్’ టెండర్లకు అవినీతి మరకలు
- బాగోతాన్ని బట్టబయలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగుతున్న టెండర్ల వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల పనుల ముసుగులో నచ్చినోళ్లకు టెండర్లు కట్టబెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే ప్లాన్ అమలుచేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపాదించిన 9 రోడ్లలో ఇప్పటివరకు రెండింటికి టెండర్లు ఖరారు చేయగా.. వాటిలోనూ ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి రూ.వేల కోట్లను పంచుకున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బాంబు పేల్చడం చర్చకు దారితీసింది.
మొదట ఈ భారీ ప్రాజెక్టును సీఎం రమేశ్‌కు చెందిన కంపెనీకి కట్టబెట్టాలని అధికార వర్గాలు విశ్వప్రయత్నాలు చేసినా ఎల్అండ్టీ అడ్డుతగలడంతో రెండో ప్యాకేజీని సర్దుబాటు చేసి వ్యవహారాన్ని చకబెట్టారని సమాచారం. మొదటి రోడ్డు అంశంలో అధికార పార్టీకి చుక్కలు చూపించేలా ఎల్అండ్టీ వ్యవహరించగా.. రేడియల్ రోడ్డు-2 విషయంలోనూ మూడు ప్యాకేజీలుగా విభజించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బుద్వేల్ రోడ్డు టెండర్ల వ్యవహారం అదే బాటలో పయనిస్తూ అవినీతి మరకలను అంటించుకున్నది. స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు చెందిన సుశీ ఇన్ఫ్రా అనే కంపెనీ ఈ టెండర్ల అక్రమాలపై బహిరంగంగా గళం విప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అధికార యంత్రాంగం నేతల కనుసన్నల్లో పనిచేసేందుకు సహకరిస్తున్నట్టు ఈ వ్యవహారంతో తేలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

