హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 8న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. అందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆదివారం బీసీ భవన్లో ఆవిష్కరించారు. అనంతరం బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్నిపార్టీల సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, సంఘని మల్లేశ్వర్, తాటికొండ విక్రమ్‌గౌడ్, కనకాల శ్యామ్కుర్మా, జాజుల లింగంగౌడ్, నరసింహాచారి, ఇంద్రం, రాజుగౌడ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.