డిసెంబర్ 7న చలో పార్లమెంట్: ఏఐవైఎఫ్
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, నిరుద్యోగ యువతకు ఉపాధి హకుల సాధన కోసం డిసెంబర్ 7న ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ సంయుక్తంగా నిర్వహించనున్న ‘చలో పార్లమెంట్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, నిరుద్యోగ యువతకు ఉపాధి హకుల సాధన కోసం డిసెంబర్ 7న ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ సంయుక్తంగా నిర్వహించనున్న ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి, జాతీయ కార్యవర్గ సభ్యుడు కే ధర్మేంద్ర పిలుపునిచ్చారు.
శనివారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో జరిగిన సమావేశంలో సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల రాజ్యాంగ విలువలు, ఎన్నికల సం ఘం స్వతంత్రత, ప్రభుత్వ విద్యారంగం ప్రమాదంలో పడ్డాయని విమర్శిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల హకులకు భంగం కలిగించే ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, నూతన విద్యా విధానం 2020ను తిరసరించాలని డిమాండ్ చేశారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు కే ధర్మేంద్ర మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతు న్నా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమైందని మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, యువతకు ఉపాధి హకును చట్టబద్ధం చేస్తూ భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం(బీఎన్ఈజీఎ) తీసుకురావాలని,విద్యను కార్పొరేటీకరణ నుంచి కాపాడేందుకు విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాడాలని కోరారు. సమావేశం లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీ మాన్, రాష్ట్ర కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ రాము, నాయకులు మహేందర్, మానస్ కుమార్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

