శభాష్.. శంషాబాద్

- వ్యాక్సిన్ హబ్‌గా మన ఎయిర్‌కార్గో
- ఔషధాల దిగుమతి, ఎగుమతుల్లో కీలకం
- కష్టకాలంలో చురుకైన పాత్ర
శంషాబాద్, మే 11: సామాజిక సేవలో, విపత్కర పరిస్థితుల్లో దేశానికే దిక్సూచిగా జీఎంఆర్ హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయం తనకు తానే సాటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 41 హబ్‌లలో హైదరాబాద్ ఒకటి. కొవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాల ఉత్పత్తికి హైదరాబాద్ నగరం హబ్‌గా, వాటి ఎగుమతులు, దిగుమతుల హ్యాండ్లింగ్ హబ్‌గా శంషాబాద్ ఎయిర్‌కార్గో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణకు, అవుట్‌బౌండ్, ఇన్‌బౌండ్ వ్యాక్సిన్ సరుకుల రవాణాకు సమర్థవంతమైన వసతి కలిగి ఉంది. హైదరాబాద్‌లో రాబోయే 18-24 నెలల్లో 300-600 కోట్ల వివిధ రకాల టీకాలు ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా. వాటి సరఫరాకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటుతో ఎయిర్‌కార్గో సంసిద్ధంగా ఉన్నది. కొవిడ్ ప్రారంభం నుంచి వ్యాక్సిన్లు, వైద్యపరికరాలు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు వంటివి మన ఎయర్కార్గో ద్వారా సజావుగా రవాణా జరిగింది. ఈ నెల 1న రష్యా నుంచి స్పుత్నిక్-వీ దిగుమతి విజయవంతమైంది.
మెరుగైన కనెక్టివిటీ
ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కార్గో హబ్‌లతోపాటు 58 దేశీయ గమ్య స్థానాలకు, 150 అంతర్జాతీయ ప్రదేశాలకు ప్రత్యక్ష సేవలను శంషాబాద్ ఎయిర్‌పోర్టు కలిగి ఉన్నది. రవాణాలో రాష్ట్ర ఆర్టీసీతోనూ ఎయిర్‌కార్గో భాగస్వామ్యం కలిగి ఉన్నది.
కొవిడ్-19 వ్యాక్సిన్ కన్ఫైన్మెంట్ల తరలింపు ఇలా..
హైదరాబాద్- గన్నవరం
హైదరాబాద్- గౌహతి
హైదరాబాద్- పాట్నా
.హైదరాబాద్- ఢిల్లీ
హైదరాబాద్- బెంగళూరు
హైదరాబాద్- పుణె
హైదరాబాద్- భువనేశ్వర్
హైదరాబాద్- జైపూర్
హైదరాబాద్- చెన్నై
హైదరాబాద్- లక్నో
శంషాబాద్ ఎయిర్‌కార్గో నుంచి 3 నెలల్లో ఔషధాలు, వ్యాక్సిన్ రవాణా (టన్నుల్లో)
జనవరి ఫిబ్రవరి మార్చి
జాతీయస్థాయి 4,800 4,500 5,000
అంతర్జాతీయ స్థాయి 5,800 6,200 6,700
10, 600 10,700 11,700
సకాలంలో, సజావుగా సరఫరా
కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి అవసరమైన రిలీఫ్ మెటీరియల్స్‌ను సకాలంలో సజావుగా సరఫరా చేయడానికి జీఎంఆర్ ఎయిర్‌పోర్టు కార్గో ఎంతో కృషి చేస్తున్నది. వ్యాక్సిన్ తరలింపు, నిర్వహణకు అవసరమైన వసతులు ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌కార్గోలో ఉన్నాయి.
– శంషాబాద్ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

