ఏసీబీ డీఎస్పీనని టోకరా
‘హాలో నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్న.. మీరు డబ్బులు బాగా తీసుకుంటున్నారట.. మీ మీద ఫిర్యాదు వచ్చింది..
- 10.5 లక్షలు సమర్పించుకున్న ఇద్దరు ఆర్టీఏ అధికారులు
సుబేదారి, అక్టోబర్ 21: ‘హాలో నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్న.. మీరు డబ్బులు బాగా తీసుకుంటున్నారట.. మీ మీద ఫిర్యాదు వచ్చింది.. సెటిల్ చేసుకోండి.. అర్జెంట్‌గా డబ్బులు ఆన్లైన్లో అకౌంట్‌కు పంపించండి’ అంటూ.. ఓ ఆగంతకుడు కొద్దిరోజుల క్రితం వరంగల్ జిల్లాలో ఇద్దరు అధికారులకు ఫోన్లు చేయడంతో రూ. 10.5 లక్షలు సమర్పించుకున్నారు. మోసపోయామని తెలిసి పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా.. రెండు వారాల క్రితం అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ అని గుర్తుతెలియని వ్యక్తి 9886826656, 9880472272, 9591938585 నంబర్ల నుంచి వరంగల్ జిల్లా ఆర్టీఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు ఫోన్లు వచ్చాయి.
‘మీ మీద ఫిర్యాదు వచ్చింది’ అని అవతలి వ్యక్తి బెదిరించాడు. నిజమేనని నమ్మిన ఓ అధికారి ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నందున మూడు దఫాలుగా రూ.10 లక్షలు, మరో అధికారి రూ. 50 వేలు ఆగంతకుడి బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేశారు. అతడు మళ్లీమళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో నకిలీ డీఎస్పీ అని తెలుసుకున్నారు. మోసపోయిన అధికారుల్లో ఒకరు రెండు రోజుల క్రితం వరంగల్‌లోని మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్‌ను వివరణ కోరగా ఆర్టీఏ అధికారి నుంచి ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఇద్దరు అధికారులు రూ.10.5 లక్షలు నకిలీ ఏసీబీ అధికారికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి మోసపోయారని, ఈ కేసుపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగంతకుడి ఫోన్ నంబర్ల లొకేషన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి కర్ణాటక నుంచి రాయలసీమ యాసలో మాట్లాడినట్టు గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

