ACB | నీటిపారుదల శాఖలో ఏసీబీ సోదాలు.. లంచం తీసుకుంటుండగా ఈఈ అరెస్ట్
నాంపల్లిలోని నీటిపారుదల శాఖలో ఏసీబీ (ACB) సోదాలు ముగిశాయి. నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని రెడ్‌హిల్స్ ఉన్న నీటిపారుదల శాఖ ఆఫీసులో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్: నాంపల్లిలోని నీటిపారుదల శాఖలో ఏసీబీ (ACB) సోదాలు ముగిశాయి. నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని రెడ్‌హిల్స్ ఉన్న నీటిపారుదల శాఖ ఆఫీసులో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్లు లంచం తీసుకుంటుంగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో లంచం డిమాండ్‌కు సంబంధించిన కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగుతున్నది. రాత్రి నాలుగు గంటలపాటు శ్రమించి నాలుగో వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు.
కాగా, ఓ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆమెదం కోసం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయ అధికారులను సంప్రదించారు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ రూ.2.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దానికి అంగీకరించిన సదరు వ్యక్తి ముందుగా రూ.1.5 లక్షలు ఇచ్చేందుకు అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దీనికి సంబంధించి బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు దాడులు జరిపి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

