పెండింగ్‌లోనే లక్షల దరఖాస్తులు
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్నికల యంత్రాంగం పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు నమోదుకు తొలి విడత గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసినా.. వచ్చిన దరఖాస్తుల్లో గణనీయమైన సంఖ్యలో ఇంకా పరిశీలనకు నోచుకోలేదు.
- పట్టభద్రుల ఓటర్ల నమోదులో అధికారుల అలసత్వం
- 12.29 లక్షల దరఖాస్తులు.. 8.34 లక్షలు పెండింగ్
- బీఎల్వోల వద్దే 6.67 లక్షలు.. ముందుకుసాగని పరిశీలన
- ముగిసిన తొలివిడత గడువు.. దరఖాస్తుకు ఇంకా అవకాశం
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్నికల యంత్రాంగం పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు నమోదుకు తొలి విడత గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసినా.. వచ్చిన దరఖాస్తుల్లో గణనీయమైన సంఖ్యలో ఇంకా పరిశీలనకు నోచుకోలేదు. అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా అందిన గణాంకాల ప్రకారం.. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కలిపి శుక్రవారం రాత్రి వరకు 12,29,862 దరఖాస్తులు రాగా.. 8,34,175 పెండింగ్‌లో ఉన్నాయి. అంటే వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 68 శాతం ఇంకా పరిషారం కాలేదు. వీటిలో ఏకంగా 6,67,445 దరఖాస్తులు బూత్ లెవెల్ అధికారుల (బీఎల్వో) వద్దే నిలిచిపోయాయి.
హైదరాబాద్‌లోనే 4.41 లక్షలు పెండింగ్
మేడ్చల్-మలాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో దరఖాస్తుల పరిశీలన మందకొడిగా సాగుతున్నది. ఈ మూడు జిల్లాల్లోనే మొ త్తం 3,65,507 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మేడ్చల్-మలాజిగిరిలో 1,17,298, రంగారెడ్డిలో 1,10,690, హైదరాబాద్‌లో 77,519 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
గడువు ముగిసినా మరో చాన్స్
ఓటరు నమోదు ప్రక్రియకు నవంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాత కూడా అర్హులైన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి స్ప ష్టంచేశారు. నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానున్నది. ఆ రోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

