తెలంగాణలో ఇద్దరికి ఒమిక్రాన్.. టిమ్స్‌లో చికిత్స
Omicron | తెలంగాణలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. ఇద్దరు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించబడినట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న కెన్యా,

హైదరాబాద్ : తెలంగాణలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. ఇద్దరు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించబడినట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు అని తెలిపారు. కెన్యా జాతీయురాలి వయసు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్స్‌కు పంపామని, నిన్న రాత్రి ఫలితాలు వచ్చాయన్నారు. వీరిద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలిందన్నారు. కెన్యా జాతీయురాలిని టిమ్స్‌కు తరలించాం. సోమాలియా దేశస్థుడిని ట్రేస్ చేస్తున్నాం.
అయితే ఈ ఇద్దరూ కూడా మెహిదీపట్నం, టోలీచౌకీలో ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇక మూడో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాడు. అతని వయసు ఏడేండ్లు మాత్రమే. ఈ బాలుడి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే కోల్‌కతాకు వెళ్లాడని, రాష్ట్రంలోకి ప్రవేశించలేదని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

