12% ఇతర వర్సిటీ సర్టిఫికెట్లు : ఇంటర్ విద్యాశాఖ
రాష్ట్రంలో క్రమబద్ధీకరించిన కాంట్రాక్ట్ లెక్చరర్లల్లో 12 శాతం మంది తెలంగాణ వెలువలి వర్సిటీల్లో చదివిన వారున్నట్టు ఇంటర్ విద్యాశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సిక్కిం, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాల్లోని వర్సిటీల్లో వీరు చదివినట్టు సర్టిఫికెట్లు సమర్పించారని పేర్కొన్నది.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో క్రమబద్ధీకరించిన కాంట్రాక్ట్ లెక్చరర్లల్లో 12 శాతం మంది తెలంగాణ వెలువలి వర్సిటీల్లో చదివిన వారున్నట్టు ఇంటర్ విద్యాశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సిక్కిం, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాల్లోని వర్సిటీల్లో వీరు చదివినట్టు సర్టిఫికెట్లు సమర్పించారని పేర్కొన్నది. కొందరు గుర్తింపు లేని స్టడీ సెంటర్లు, దూరవిద్యా ప్రోగామ్‌లు పూర్తిచేయడమే కాకుండా.. అనుమానాస్పద, నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని తమ విచారణలో తేలిందని వెల్లడించింది.
ఆయా సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రత్యేక బృందాలను వర్సిటీలకు పంపించామని పేర్కొన్నది. విద్యార్హతలు, సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రొబేషనరీ డిక్లరేషన్, సర్వీస్ బెనిఫిట్స్ మంజూరు చేయాల్సి ఉంటుందని తెలిపింది. క్రమబద్ధీకరించిన లెక్చరర్లపై ఎలాంటి కక్షసాధింపు ధోరణి లేదని, వారి సమస్యలు పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నది. జేఎల్స్ ప్రొబేషనరీ డిక్లరేషన్ కోసం లెక్చరర్ల ఎదురుచూపుపై ‘సీఎంశాఖలోనే అధ్యాపకులకు తిప్పలు’ శీర్షిక ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కాగా, ఈ మేరకు విద్యాశాఖ వివరణ ఇచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

