అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన జేపీ మోర్గాన్

హైదరాబాద్: అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్ తన కొత్త క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైటెక్ సిటీలోని సాలార్పురియా సత్వ నాలెడ్జ్ సిటీలో 8,22,000 చదరపు అడుగుల ఏరియాలో ఏర్పాటు చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆ సంస్థకున్న ముఖ్య క్యాంపస్‌లలో ఇది అతి పెద్దది. నగరంలోని ఈ కొత్త క్యాంపస్ టెక్నాలజీ, రిస్క్, ఆపరేషన్స్, సపోర్ట్ సర్వీసుల్లో ఉద్యోగుల కోసం ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ తన ఉనికిని ఏకీకృతం చేయనున్నది.
‘జేపీ మోర్గాన్‌కు హైదరాబాద్ ఒక కీలక ఆర్థిక, సాంకేతిక కేంద్రం. భారతదేశంలోని మా వృద్ధిలో ఇది అంతర్భాగం. కొత్త ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, మా ఖాతాదారుల అవసరాలను తీర్చడంలో మా నిబద్ధతకు బలమైన నిదర్శనం. అదే సమయంలో మా ఉద్యోగులకు ప్రపంచస్థాయి పని వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. అలాగే నగరం అందించే అద్భుతమైన టాలెంట్ పూల్‌ను అందిపుచ్చుకుంటాం’ అని ఆ సంస్థ గ్లోబల్ సర్వీసెస్ హెడ్, కమర్షియల్ బ్యాంకింగ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డేనియల్ విల్కెనింగ్ అన్నారు.
‘ఒక కమ్యూనిటీ విజన్‌కు ఈ క్యాంపస్ ప్రాణం పోసింది. శ్రేయస్సు, సుస్థిరత, సహకార స్తంభాలపై ఇది నిర్మితమైంది. దీని రూపకల్పన, నిర్మాణానికి సంబంధించి తీసుకున్న ప్రతి నిర్ణయం మా ఉద్యోగుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది. అలాగే భవిష్యత్తులో పని ప్రదేశాల వాతావరణం ఎలా అభివృద్ధి చెందుతుందో అన్నది ఇది ప్రతిబింబిస్తుంది’ అని ఆ సంస్థ ఇండియా, ఫిలిప్పీన్స్ కార్పొరేట్ సెంటర్స్ సీఈవో దీపక్ మంగ్లా తెలిపారు. ఆరోగ్యకరమైన, సురక్షితమైన పని ప్రదేశాన్ని సృష్టించడానికి ఈ క్యాంపస్‌ను నిర్మించినట్లు చెప్పారు. యాక్టివ్ వెల్నెస్ జోన్లు, డెడికేటెడ్ రిలాక్సేషన్, రిఫ్లెక్షన్ జోన్లు, ఒక శిశుగృహంతో పాటు పూర్తిస్థాయిలో మెడికల్ సెంటర్‌ను ఇది కలిగి ఉన్నదని వివరించారు.
సృజనాత్మకతను పెంపొందించడం, ఆలోచనల భాగస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకోవడం కోసం ఇన్నోవేషన్ ల్యాబ్, టెక్ బార్, ట్రైనింగ్, కాన్ఫరెన్స్ సెంటర్ సౌకర్యాలు, ప్రతి వర్క్ ఫ్లోర్లో ఓపెన్ వర్క్ కేఫ్‌లు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులన్నీ తమ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉన్నట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు. అలాగే ఈ క్యాంపస్‌కు లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ డిజైన్ (లీడ్ – యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్), ఫిట్ -అవుట్ గోల్డ్ స్టాండర్డ్ లభించిందని చెప్పారు. స్థిరత్వం, నిలకడలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఇది సెట్ చేసిందని పేర్కొన్నారు. విద్యుత్తు వినియోగాన్ని బాగా నియంత్రించడాని, పర్యవేక్షించడానికి విద్యుత్తు సామర్థ్య భవన నిర్వహణ వ్యవస్థ, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్లు, పేపర్‌లెస్, డిజిటలైజేషన్ కార్యక్రమాలు వంటివి ఈ క్యాంపస్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైనవని వెల్లడించారు.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

