Tattoo | అంగితోపాటు టాటూ తొడిగేయండి.. చొక్కాతోనే విప్పేయండి
పచ్చబొట్టు చెరిపేయలేం. అలా అని దాని మీద మోజునూ తుంచేయలేం. రాత్రి పార్టీకి కావాలనిపిస్తుంది. ఉదయం ఆఫీసుకు వద్దనిపిస్తుంది. అలా ఎలా బాస్... అనే వాళ్లు ఉండొచ్చు. మాకంతే కావాలి బ్రోస్.. అని చెప్పేవాళ్లూ కనిపించొచ్చు. కోరుకున్నది చిటికెలో వచ్చేసే యుగంలో ఇదేం అసాధ్యమా అనుకున్నారు నేటి ఫ్యాషనిస్టులు.
Tattoo | టాటూ వేసుకోవాలని, స్టైలిష్ లుక్లో కనిపించాలని ఉందా? కానీ టాటూను ఎప్పుడూ ఒంటి మీద ఉంచుకోవడం ఇష్టం లేదా?.. ఇంకేం అయితే, చొక్కాతో పాటు టాటూ తొడిగేయండి. చొక్కాతోనే విప్పేయండి. అవును.. ఇప్పుడు టాటూ చొక్కాలూ, లెగ్గింగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి మరి! దుస్తులతో పాటే టాటూను వేసుకోవచ్చు.. తీసేయనూవచ్చు!
పచ్చబొట్టు చెరిపేయలేం. అలా అని దాని మీద మోజునూ తుంచేయలేం. రాత్రి పార్టీకి కావాలనిపిస్తుంది. ఉదయం ఆఫీసుకు వద్దనిపిస్తుంది. అలా ఎలా బాస్.. అనే వాళ్లు ఉండొచ్చు. మాకంతే కావాలి బ్రోస్.. అని చెప్పేవాళ్లూ కనిపించొచ్చు. కోరుకున్నది చిటికెలో వచ్చేసే యుగంలో ఇదేం అసాధ్యమా అనుకున్నారు నేటి ఫ్యాషనిస్టులు. నవతరం బడ్డీల కోసం టాటూ స్లీవ్ టీషర్టులు, టాటూ ప్రింటెడ్ లెగ్గింగ్లు తయారు చేస్తున్నారు. లెగ్గింగ్ లేదా చొక్కాతో పాటు ఎంచక్కా ఈ టాటూలనూ తొడుక్కోవచ్చు. చిటికెలో పార్టీకి రెడీ అయిపోవచ్చు.
టాటూ నచ్చినట్టు
ఈ టాటూ స్లీవ్ టీ షర్టులు చూసేందుకు మామూలు వాటిలాగే ఉంటాయి. హాఫ్హ్యాండ్స్తో వచ్చే ఈ టీషర్టు చేతులకు అదనంగా సాగే గుణమున్న మెష్క్లాత్ మణికట్టు వరకూ ఉంటుంది. దీని మీద రకరకాల టాటూ ప్రింట్లు ఉంటాయి. ఈ వస్త్రం పారదర్శకంగా ఉంటుండటంతో మన చేతి మీదే ఆ ప్రింట్ వేసినట్టు కనిపిస్తుంది. మెత్తగా ఎలాస్టిక్లా వచ్చే ఇది చర్మంపైన చక్కగా అతుక్కుంటుంది. ఆడామగా.. ఇద్దరికి కోసమూ ఈ చొక్కాలు తయారవుతున్నాయి. ఇక, ఈ తరహాలోని లెగ్గింగ్లు కూడా అచ్చం చర్మంలాంటి రంగులోనే వస్తుండటంతో చూడగానే కాలి మీద టాటూ వేసుకున్నట్టు కనిపిస్తుంది. కాలు మొత్తం టాటూ కావాలా లేదా కొంచెం వరకూ కావాలా అన్నదీ ఎంచుకోవచ్చు. రంగుల టాటూనా లేదా బ్లాక్ అండ్ వైట్ తరహానా అన్నది కూడా మన ఇష్టాన్ని బట్టే. మొత్తానికి ఒంటి మీద మచ్చ పడకుండా మాయా మశ్చీంద్రాలా రెడీ అయిపోవాలంటే… ఈ టాటూ వస్ర్తాలు వేసుకుంటే చాలు. మిగతాదంతా మ్యాజిక్కే!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

